ఎండలపై అలర్ట్.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

ఎండలపై అలర్ట్..  కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో తీవ్రమవుతున్న ఎండలు(Sun), వడగాలుల(Heat waves) ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఉన్నత స్థాయి సమీక్ష(High level review) నిర్వహించారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాలలో చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ఎండల తీవ్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని చంద్రబాబు సూచించారు.

Next Story