- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ సరఫరాపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మంత్రులకు దిశానిర్దేశం చేశారు. గ్యాస్ సరఫరా పరిస్థితిపై పలువురు మంత్రులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితిపై మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. గ్యాస్ సరఫరా అంశంపై ఏర్పాటైన మంత్రుల సబ్‌కమిటీ సమావేశం ఇవాళ జరగనున్నట్లు ఆయన సీఎంకు తెలిపారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలను పూర్తిస్థాయిలో తీసుకోవాలని సీఎం సూచించారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని మంత్రులను ఆదేశించారు. అదేవిధంగా హోటళ్లు సహా సంబంధిత భాగస్వామ్య వర్గాలతో చర్చలు జరిపి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులకు స్పష్టం చేశారు.






