పూర్తిగా తెలుసుకోండి: మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

ప్రతి రాజకీయ అంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు...

పూర్తిగా తెలుసుకోండి: మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి రాజకీయ అంశాన్ని పూర్తిగా తెలుసుకోవాలని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrabau Naidu) సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party) చేస్తు్న్న విమర్శలపై కేబినెట్ భేటీ అనంతరం ఆయన స్పందించారు. పూర్తి అవగాహన తర్వాతనే మాట్లాడాలని మంత్రులు, నేతలకు చంద్రబాబు సూచించారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్య, కోడి కత్తి ఘటన, పరకామణి చోరీపై ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. 1985 నుంచి ప్రతి సబ్జెక్టుపై తాను ఎలా ప్రిపేరై మాట్లాడాననే విషయాలు వారికి చంద్రబాబు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే అసత్యప్రచారాలు ప్రజల్లోకి వెళ్తున్నాయన్న సమాచారంతో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Next Story