- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా దినోత్సవం రోజున చీరాల ఎమ్మెల్యే ఆవేదన
జనాభాలో సగభాగమైన మహిళలను అన్ని విధాలుగా అణిచివేయటం వలన కుటుంబ వ్యవస్థ పతనమవుతుందని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, చీరాల: జనాభాలో సగభాగమైన మహిళలను అన్ని విధాలుగా అణిచివేయటం వలన కుటుంబ వ్యవస్థ పతనమవుతుందని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరాల పట్టణంలో శనివారం ఉదయం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఫ్రైడ్ ఇంటర్నేషనల్ స్కూలు సంయుక్తంగా నిర్వహించిన మహిళా సంఘీభావ ర్యాలీలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొని మాట్లాడారు. మహిళలు లేనిదే కుటుంబ వ్యవస్థ లేదని, ఇంట్లో , ప్రభుత్వ కార్యాలయాల్లో రోజువారి జీవితంలో మహిళలు తీవ్ర వేధింపులకు అణిచివేతకు గురవుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో గంజాయి మద్యం మత్తులో యువత మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారని, చిన్నపిల్లలను వృద్ధ మహిళలను సైతం వేధిస్తున్నారని తెలిపారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలకు మనందరం బాసటగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మహిళల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటుందని మాలకొండయ్య తెలిపారు. అనంతరం పట్టణంలో జరిగిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ శ్రీదేవి, శ్రీదేవి డాక్టర్ భవాని ప్రసాదు, పూర్వీ రాజేష్, ప్రైడ్ స్కూల్ డైరెక్టర్ బి అశోక్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






