- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమకు నీళ్లు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమ లిఫ్ట్‌తో చాలా ప్రయోజనాలున్నాయని వైసీపీ నేతలు మభ్య పెడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సీఎం చంద్రబాబు వల్లే నిలిచిపోయిందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్‌తో చాలా ప్రయోజనాలున్నాయని వైసీపీ నేతలు మభ్య పెడుతున్నారన్నారు. మచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా శ్రీశైలంలో 798 అడుగుల వద్ద నీళ్లు తీసుకోవచ్చన్నారు. 2014-19 మధ్య సాగునీటి రంగానికి రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయంటే అది తమ ప్రభుత్వం తీసుకున్న చొరవేనని చెప్పారు. చింతలపూడి, వంశధార-నాగావళి సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వెలిగొండ పూర్తితో పశ్చిమ ప్రకాశంకు తాగు, సాగు నీళ్లిస్తామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు తీసుకునే బాధ్యత సాగునీటి సంఘాలదేనన్నారు. కాల్వల మరమ్మతులతో పాటు అన్ని పనులను సాగు నీటి సంఘాలకే అప్పగిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పారే నీళ్లను నిలపండి.. నడిచే నీటిని ప్రాజెక్టులకు మార్చండన్నారు. అలాగే భూగర్భ జలాశయంలో నీటి నిల్వలు పెరిగేలా చూడండని సాగు నీటి సంఘాలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.






