తురకపాలెం గ్రామస్తుల అనారోగ్యానికి కారణం యురేనియమా? అధ్యయనంలో తేలిందేంటి?

by Naga Rani Yarlagadda |

గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామస్తులు ఎదుర్కొంటున్న తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం.. యురేనియం కలిసిన నీటిని తాగడమని తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

తురకపాలెం గ్రామస్తుల అనారోగ్యానికి కారణం యురేనియమా? అధ్యయనంలో తేలిందేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామస్తులు ఎదుర్కొంటున్న తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణం.. యురేనియం కలిసిన నీటిని తాగడమని తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు తెలుస్తోంది. గ్రామంలోని ప్రజలు ఒకేసారి అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు వారికి బ్లడ్ టెస్టులు నిర్వహించారు. కొందరికి మెలియాయిడోసిస్ ఉన్నట్లు నిర్థారణైనట్లు తెలిపారు. గ్రామస్తుల అనారోగ్యానికి కారణాలు తెలుసుకునేందుకు నీరు, మట్టి, స్థానికుల బ్లడ్ శాంపిల్స్ ను సేకరించిన వైద్య బృందం.. వాటిని చెన్నై, ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ లకు పంపించింది. శాంపిల్స్ ను పరీక్షించిన చెన్నై ల్యాబ్స్.. గ్రామంలోని త్రాగునీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

గ్రామం చుట్టూ రాళ్ల క్వారీలు, వాటిలోనే పరిసర ప్రాంతాల ప్రజలు పనిచేస్తుండటంతో, క్వారీ గుంతల్లోని నీటిని వాడటం వల్లే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినట్లు అనుమానిస్తున్నారు. స్ట్రాన్షియంతో పాటు ఈకొలి అనే బ్యాక్టీరియా కూడా నీటిలో ఉన్నట్లు గుర్తించారని సమాచారం. కాగా.. యురేనియం శరీరానికి చాలా హానికరమని వైద్యులు చెప్తున్నారు. ఇది శరీరంలోకి వెళ్తే మూత్రపిండాలకు తీరని నష్టం చేస్తుందని, చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. లివర్, లంగ్స్, బ్రెయిన్, బోన్స్ డెన్సిటీని కూడా దెబ్బ తీస్తుందని చెప్తున్నారు.

Next Story