- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IRR Case: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. అప్పటి వరకూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై విచారణ జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంద్రబాబుకు ఈ నెల 18 వరకు ఊరట లభించనుంది.
కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్‌ను మార్పు చేశారని సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చారు. ఇన్నర్ రిండ్ రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పు ద్వారా పలువురికి లబ్ధి చేకూర్చారని చంద్రబాబుపై సీఐడీ అభియోగం మోపింది. ఇప్పటికే 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది. దీంతో కోర్టులో చంద్రబాబు లాయర్లు, సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నెల 18న ఏం జరుగుతుందో చూడాలి.
Next Story






