- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోరంట్ల మాధవ్ తో పాటు మరో 5 గురిపై కేసులు
వైసీపీ పార్టీ ( YCP party) మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ( Gorantla Madhav) అరెస్ట్ పై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ( Sa

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ పార్టీ ( YCP party) మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ( Gorantla Madhav) అరెస్ట్ పై గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ( Satish Kumar ) కీలక ప్రకటన చేశారు. పోలీసుల ( Police ) అదుపులో ఉన్న కిరణ్ అనే నిందితుడిపై గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని చెప్పారు ఎస్పీ సతీష్ కుమార్. పోలీసులపై జులుం ప్రదర్శించి విధులకు ఆటంకం కలిగించడం నేరపూరిత చర్య అని ఫైర్ అయ్యారు.
చుట్టుగుంట వద్ద పోలీసు వాహనాన్ని మాధవ్ అనుచరులతో కలిసి అడ్డుకున్నారని తెలిపారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ( Satish Kumar ). వైసీపీ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తో పాటు మరో ఐదుగురు ఈ దాడిలో పాల్గొన్నారన్నారు. ఎస్పీ కార్యాలయం వద్ద కూడా మాధవ్ దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. ఈ మేరకు మాధవ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామని చెప్పారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.
ఇక అంతకుముందు పోలీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దురుసు ప్రవర్తనతో రెచ్చిపోయారు. మీడియా ముందుకు రావటానికి గోరంట్ల నిరాకరించారు. ఎంపీగా పని చేసిన వ్యక్తిని మీడియా ముందు పెడతారా అంటూ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గుంటూరు జిల్లా కోర్టుకు గోరంట్ల మాధవ్ తరలించారు.
పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ అనే నిందితుడిపై గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారు: ఎస్పీ సతీష్ కుమార్
— BIG TV Breaking News (@bigtvtelugu) April 11, 2025
పోలీసులపై జులుం ప్రదర్శించి విధులకు ఆటంకం కలిగించడం నేరపూరితచర్య
చుట్టుగుంట వద్ద పోలీసు వాహనాన్ని మాధవ్ అనుచరులతో కలిసి అడ్డుకున్నారు
మాధవ్‌తో పాటు మరో ఐదుగురు ఈ దాడిలో పాల్గొన్నారు… https://t.co/nX9vcvddH8 pic.twitter.com/jz5TIQ5W3B






