ఆర్టీఓగా ఎంపికైన కార్పెంటర్ కుమారుడు

by Thanuru Gopichand |

కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించిన మధ్య తరగతి యువకుడు.

ఆర్టీఓగా ఎంపికైన కార్పెంటర్ కుమారుడు
X

దిశ ప్రతినిధి, నరసరావుపేట : నరసరావుపేటలో ఓ కార్పెంటర్ కుమారుడు గ్రూప్–1 పరీక్షల్లో ఆర్టీఓగా ఎంపిక అయ్యారు. నరసరావుపేట వరవకట్ట ప్రాంతానికి చెందిన షేక్ యూసుఫ్ సలాం గ్రూప్–1 పరీక్షల్లో ప్రతిభ చూపి ఆర్టీఓగా ఉద్యోగాన్ని సాధించారు. యూసుఫ్ సలాం తండ్రి సుభానీ వృత్తిరీత్యా కార్పెంటర్, తల్లి గృహిణి. వారిది ఎలాంటి రాజకీయ, ఆర్థిక బలం లేని సామాన్య కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సలాం కఠినమైన పోటీ పరీక్షను జయించడం ఆయన పట్టుదలకు నిదర్శనం అని సన్నిహితులు అంటున్నారు. వేల మంది అభ్యర్థులతో పోటీ పడి, క్రమశిక్షణతో చదివి ఆర్ టీ ఓ స్థాయికి చేరుకున్నందుకు అభినందిస్తున్నారు. గ్రూప్–1 లాంటి అత్యంత కఠిన పరీక్షల్లో విజయం సాధించడం మాటలు లో చెప్పే ప్రతిభ కాదు, రోజువారీ శ్రమ, త్యాగాలు, స్థిరమైన లక్ష్యం లేకుండా సాధ్యమే కాదని అంటున్నారు. యూసుఫ్ సలాం విజయం నరసరావుపేట ప్రాంత యువతకు నేపథ్యం కాదు, పట్టుదలే విజయాన్ని నిర్ణయిస్తుందనే స్పష్టమైన సందేశం ఇస్తుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Next Story