- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి న్యాయం చేశారా!.. CM Jaganకు సోము వీర్రాజు లేఖ
by Vemula.Srinu Prasad |
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ ఏమైందని సీఎం జగన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు...

X
దిశ, వెబ్ డెస్క్: అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ ఏమైందని సీఎం జగన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఇప్పటివరకు ఎంతమందికి న్యాయం చేశారో చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో 142 మంది బాధితులు మనస్తాపంతో చనిపోయారని పేర్కొన్నారు. అగ్నిగోల్డ్ ఆస్తులు అమ్మేందుకు ఉన్న అడ్డంకులు తెలపారని విజ్ఞప్తి చేశారు. త్వరగా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘2019 ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ బాధితులకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా అందరికీ ఎందుకు న్యాయం చేయలేకపోయారు.’ అని సోము వీర్రాజు గుర్తు చేశారు.
Next Story






