- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాపట్ల | ద్రోణాదులలో వీఆర్ఏ వీరంగం!!
గ్రామస్తులకు చేదోడు వాదోడుగా ఉండే గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో వీఆర్ఏ కూడా ఒకరు.

దిశ, వెబ్ డెస్క్ : గ్రామస్తులకు చేదోడు వాదోడుగా ఉండే గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో వీఆర్ఏ కూడా ఒకరు. కానీ అదే వీఆర్ఏ విధులను మరచి వీధి పోరాటాలకు దిగితే ఆశ్చర్యం కలిగించక మానదు. మామూలుగానే గ్రామంలో కొద్దోగొప్పో పలుకుబడి కలిగిన వీఆర్ఏలు ఒక్కోసారి గ్రామస్తులను ముప్పు తిప్పలు పెడుతుంటారు. అయితే అందరూ అలా ఉంటారని కాదు కానీ.. కొందరు మాత్రం అలా ఉంటూ ఉంటారు. అప్పుడప్పుడు వారు చేసే కొన్ని పనులు వెలికి వచ్చినప్పుడు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. ఇంకొన్నిసార్లు ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, ఆవేదనను కూడా కలిగిస్తుంటాయి. అయితే గ్రామ పాలనలో వారి పాత్ర మాత్రం కాదనలేనిది. మండల స్థాయిలో ఎంఆర్ఓ, గ్రామస్థాయిలో వీఆర్ఓ, వీఆర్ఏలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. మరి అలాంటి వీఆర్ఏ వీరంగం వేస్తే.. ఆయుధం పట్టి ఊరంతా తిరిగితే ఎలా ఉంటుంది? అటువంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలోని మార్టూరు మండలం పరిధిలో ఉన్న ద్రోణాదులలో వెలుగు చూసింది. ఆర్టీసీ డ్రైవరుతో ఘర్షణకు దిగిన ఓ వీఆర్ఏ అతని కోసం ఊరంతా గాలించి చిందులేసిన సంఘటన ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. వీఆర్ఏ బ్రహ్మయ్య మద్యం సేవించేందుకు ద్రోణాదులలోని మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. ఆర్టీసీ డ్రైవర్ సుభానీ కూడా అక్కడకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న ఇరువురు ఒకరితో ఒకరు ఘర్షణకు దిగారు. దీంతో ఇరు వర్గాలుగా ఏర్పడి మందుబాబులు గొడవ పడడం మొదలుపెట్టారు. స్థానికుల ప్రమేయంతో కాసేపటికి వివాదం సద్దుమణగడంతో ఎక్కడివారు అక్కడకు వెళ్లిపోయారు. అయితే ఏ మాత్రం కోపం తగ్గని బ్రహ్మయ్య భుజాన గొడ్డలి తగిలించుకున్నాడు. ఆర్టీసీ డ్రైవర్ సుభానీ కోసం ఊరంతటా గాలించడం ప్రారంభించాడు. నిన్ను వదిలేది లేదనుకుంటూ సుభానీ ఇంటికి వెళ్లి హల్ చల్ చేశాడు. గొడ్డలి పట్టుకొని ఊరంతా తిరిగాడు. ఇది చూసిన గ్రామస్తులు వీఆర్ఏ ప్రవర్తనతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇదేందయ్యా ఇది.. ప్రభుత్వ ఉద్యోగి గొడలట్టుకొని తిరగడమేంటని ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో మార్టూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వీఆర్ఏను అదుపులోకి తీసుకొచి విచారిస్తున్నట్లు సమాచారం.






