- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bapatla : గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా.. డ్రైవర్ మరణం
గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టి డ్రైవర్ మరణించిన సంఘటన బాపట్ల జిల్లాలోని వేమూరులో (Vemuru)మంగళవారం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టి డ్రైవర్ మరణించిన సంఘటన బాపట్ల జిల్లాలోని వేమూరులో (Vemuru)మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే హెచ్పీ గ్యాస్ (HP Gas)సంస్థకు చెందిన లారీలో బాపట్ల నిజాంపేట మండలంలోని అడవుల దీవికి సిలిండర్లను తీసుకొచ్చి అన్ లోడ్ చేశారు. అనంతరం ఖాళీ సిలిండర్లను అదే లారీలో తిరిగి తీసుకెళ్తున్నారు. తిరిగి కొండపల్లి వెళ్తుండగా వేమూరు వద్ద సిలిండర్ల లారీ బోల్తా కొట్టింది.
ఈ దుర్ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు. అతడిని విజయవాడ (Vijayawada) అజిత్ సింగ్ నగర్ కు చెందిన శాఖమూరి రాంబాబుగా (54) పోలీసులు గుర్తించారు. ఘటనను బట్టి డ్రైవర్ కు గుండెపోటు రావడం లేదా నిద్రలేమి కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అతని డెబ్ బాడీని శవ పంచనామా నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






