దిశ ఎఫెక్ట్ : క్షణాల్లో స్పందించిన కలెక్టర్.. అధికారుల ఉరుకులు పరుగులు

by Bhoopathi Nagaiah |

జిల్లాలోని నగరం మండలం ఈదుపల్లిలో గ్రామంలో డెంగ్యూ జ్వరంతో ఇద్దరు మృతి చెందిన విషయాన్ని ‘దిశ’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

దిశ ఎఫెక్ట్ : క్షణాల్లో స్పందించిన కలెక్టర్.. అధికారుల ఉరుకులు పరుగులు
X

దిశ ప్రతినిధి, బాపట్ల: జిల్లాలోని నగరం మండలం ఈదుపల్లిలో గ్రామంలో డెంగ్యూ జ్వరంతో ఇద్దరు మృతి చెందిన విషయాన్ని ‘దిశ’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనం ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తక్షణ విచారణ చేపట్టాలని జిల్లా వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. రంగంలోకి దిగిన వైద్యాధికారులు ఈదుపల్లి గ్రామానికి వైద్య బృందాలను పంపేందుకు చర్యలు చేపట్టింది. గ్రామంలో పూర్తి ఫాగింగ్, స్ప్రే, హెల్త్ క్యాంప్ నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. నీటి నిల్వలు తొలగించాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలనీ ప్రజలకు సూచించడంతోపాటు, డెంగ్యూ నివారణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్.. వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.

Next Story