- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంజాన్‌కు సమగ్ర ఏర్పాట్లు చేయండి: ప్రభుత్వానికి అబ్దుల్ అజీజ్ లేఖ
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మసీదులలో తాగునీరు, పారిశుద్ధ్యం, శుభ్రత, భద్రత, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో ఎటువంటి లోపం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కోరారు....

దిశ, వెబ్ డెస్క్: పవిత్ర రంజాన్(Ramadan) మాసం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఏర్పాట్లు చేయాలని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్(AP Waqf Board Chairman Abdul Aziz) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూఖ్(Minority Welfare Minister Nasyam Mohammed Farooq)కు లేఖ రాశారు. 2026 ఫిబ్రవరి 18 లేదా 19 తేదీల్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యే నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మసీదుల్లో భారీగా ఐదు పూటల ప్రార్థనలు, ప్రత్యేక తరావీహ్ నమాజులు నిర్వహించబడనున్నాయని తెలిపారు. సహరి, ఇఫ్తార్ వేళల్లో ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.
మసీదులలో తాగునీరు, పారిశుద్ధ్యం, శుభ్రత, భద్రత, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో ఎటువంటి లోపం లేకుండా మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రాత్రి వేళల్లో మార్కెట్లు, కూరగాయల దుకాణాలు, హోటళ్లకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసేలా పోలీస్ శాఖకు మార్గదర్శకాలు ఇవ్వాలని అన్నారు. మసీదుల వద్ద సదుపాయాల కోసం రాష్ట్రంలోని వక్ఫ్ సంస్థల నిర్వాహకులకు, అన్ని జిల్లాల ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్‌లకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ జిల్లాల యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.






