Mangalagiri: వైసీపీకి ఝలక్.. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-11 10:27:03  IST  )

ఏపీ జనసేన పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత, విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు ఇటీవల జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....

Mangalagiri: వైసీపీకి ఝలక్.. జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ జనసేన పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత, విజయనగరం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు ఇటీవల జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ సదస్సులో ఆమె పాల్గొన్నారు. దీంతో ఆమె జనసేన పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. బీసీ సదస్సు తర్వాత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం.

2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు

కాగా కాండ్రు కమల 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున మంగళగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆమె టీడీపీలో చేరారు.


2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి సీటు ఆశించినా అవకాశం దక్కకపోవడంతో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆమె వైసీపీలో కొనసాగారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్లనానిపై కొంతకాలంగా కాండ్రు కమల ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ మారుతున్నట్లు మంగళగిరిలో ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Next Story