AP: భూముల ధరలపై జగన్ సర్కార్ మరో నిర్ణయం

by Disha Web Desk 16 |
AP: భూముల ధరలపై  జగన్ సర్కార్ మరో నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భూముల ధరలపై ఈ రాత్రికి కీలక ఉత్తర్వులు వెలువెడనున్నాయి. గురువారం నుంచి రాష్ట్రంలో భూముల ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం కీలక అప్‌డేట్ విడుదల చేయనుంది. ఎక్కడెక్కడయితే ధరలు మార్చాలన్న అంశంపై ఇప్పటికే నివేదికలు సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ధరల వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే భూముల ధరల పెంపును అమలు చేయనుంది. ఈ మేరకు కొన్ని మండలాల్లో మాత్రమే 29 నుంచి 31 శాతం మేర భూముల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయనుంది.

మరోవైపు భూముల ధరలు పెరుగుతున్నాయని తెలియడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సాధారణ జనంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటెత్తారు. ఈ మేరకు నిన్నా, మొన్నా సర్వర్లు మొరాయించాయి. నేడు సర్వర్లన్నీ పునరుద్ధరణ అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed