- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల లడ్డూ వ్యవహారం.. ఢిల్లీకి సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ఢిల్లీకి వెళ్లనున్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) ఈ నెల 9న ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu) తాజా పరిణామాలను కేంద్రం పెద్దల దృష్టికి తీసుకెళ్తారని సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు టూర్‌కు ప్రాధాన్యత చోటు చేసుకుంది.
సంచలనంగా కల్తీ నెయ్యి వ్యవహారం
కాగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే కోర్టుకు సిట్ నివేదిక సమర్పించినప్పటి నుంచి రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరింది. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువల కొవ్వు కలవలేదని సీట్ తేల్చడం, గతంలో సీఎం చంద్రబాబు కలిసిందని చెప్పడం తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్, కూటమి నేతల మధ్య మరింత మాటల యుద్ధానికి కారణమైంది. పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ మాటల యుద్ధం కాస్త వైసీపీ నేతల ఇళ్లపై దాడులకు కూడా కారణమైంది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. జంతువుల కొవ్వు కలవలేదని కావాలనే దుష్ప్రచారం చేశారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ చర్చనీయాంశంగా మారింది.






