- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
విజయవాడ నుంచి అమరావతి వెళ్తుండగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. బస్సు ముందు టైరు ఒక్కసారిగా పంక్చర్ అయింది. దీంతో బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada) నుంచి అమరావతి(Amaravati) వెళ్తుండగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సు(APS RTC Bus)కు ప్రమాదం జరిగింది. బస్సు ముందు టైరు ఒక్కసారిగా పంక్చర్ అయింది. దీంతో బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ పరిణామంతో బస్సు ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రయాణికుల్లో నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును కాలువలో నుంచి బయటకు తీశారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






