Rain Alert: రెండు రోజులు బయటకెళ్లొద్దు.. ఏపీ ప్రజలకు హెచ్చరిక!

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-04-27 14:18:18  IST  )

ఏపీకి అమరావతి వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన ప్రకటించారు...

Rain Alert:  రెండు రోజులు బయటకెళ్లొద్దు.. ఏపీ ప్రజలకు హెచ్చరిక!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీకి అమరావతి వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచన ప్రకటించారు. విదర్భ నుంచి ఉపరితల అవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల శుక్రవారం, శనివారం వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించారు. కోస్తా, సీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ఏపీ జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. వర్షం పడుతున్నప్పుడు పిడుగులు పడే అవకాశముందని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు వెళ్లొద్దని తెలిపారు. రైతులు, కూలీలు, గొర్రెలకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story