Varahi Shedule: జనాల్లోకి జనసేనాని.. 11 నియోజకవర్గాల్లో యాత్ర, సభలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-06-11 16:51:17  IST  )

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వారాహి’ యాత్రకు సర్వం సిద్ధమైంది....

Varahi Shedule: జనాల్లోకి జనసేనాని.. 11 నియోజకవర్గాల్లో యాత్ర, సభలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘వారాహి’ యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి జనాల్లోకి ఆయన వెళ్లనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి మంగళగిరికి వెళ్లిన పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో ఆదివారం చర్చించారు. తొలి దశలో ఉభయగోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం 11 నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టడంతో పాటు జనసేన అధినేత భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. జూన్ 14 కత్తిపూడిలో సభ, జూన్ 16న పిఠాపురంలో యాత్రతో పాటు సభ, జూన్ 18న కాకినాడ, జూన్ 20న ముమ్మిడివరం, జూన్ 22న పి.గన్నవరంలో వారాహి యాత్ర, మలికిపురంలో సభ, జూన్ 23న నరసాపురంలో యాత్రతో పాటు సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

జగన్ ఆ విషయంలో సిగ్గు పడాలి: YCP సర్కార్‌పై అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్

అభివృద్ధి కానరాదేమి?: అమిత్ షా

Next Story