- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mangalagiri:కార్నియా ట్రాన్స్ ప్లాంట్ సెంటర్.. త్వరలో అందుబాటులోకి తేనున్న AIIMS
మంగళగిరి ఎయిమ్స్‌లో కార్నియా ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ అందుబాటులోకి వస్తోంది.

దిశ ప్రతినిధి, గుంటూరు: మంగళగిరి ఎయిమ్స్‌లో కార్నియా ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ అందుబాటులోకి వస్తోంది. ఈ సౌకర్యంతో గుంటూరు జిల్లాతో పాటు మూడు జిల్లాల కంటి సమస్య బాధితులకు పరిష్కారం దొరకనుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకున్న చొరవతో ఎయిమ్స్‌కు ఈ సౌకర్యం తీసుకురావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 28న ఎయిమ్స్ గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్.పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించడం జరిగింది.
పరిశీలనలో భాగంగా ఆసుపత్రిలో సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత తదితర అంశాలు పెమ్మసాని గుర్తించారు. అందులో భాగంగా ఎయిమ్స్‌లో కార్నియా ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ అవసరమని వైద్యాధికారుల ద్వారా పెమ్మసాని తెలుసుకున్నారు. కాగా ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది కాబట్టి, జిల్లా వైద్య & ఆరోగ్యాధికారికి విషయాన్ని పెమ్మసాని తెలియజేశారు. ఈ క్రమంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఎయిమ్స్‌లో పరిశీలన జరిపి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపిన పెమ్మసాని కృషి ఫలితంగా.. ప్రభుత్వం నుంచి ఎయిమ్స్‌లో కార్నియా మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతులు దక్కాయి.






