గుంటూరు కలెక్టరేట్ వద్ద కలకలం.. ఎలుకలు మందు తాగిన మహిళ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-19 10:06:51  IST  )

గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఒక్కసారిగా మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది...

గుంటూరు కలెక్టరేట్ వద్ద కలకలం.. ఎలుకలు మందు తాగిన మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District) కలెక్టరేట్ వద్ద ఒక్కసారిగా మహిళ(Women) ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) కలకలం రేపింది. జిల్లాకు చెందిన మహిళ ఈ ఉదయం కలెక్టరేట్ వద్దకు వెళ్లారు. తన స్థలాన్ని ఆక్రమించారని, వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధించి అధికారులకు గతంలోనూ ఫిర్యాదు చేశారు. ఈ రోజు కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో మనస్థానం చెందిన ఆమె పురుగులు మందు తాగారు. అనంతరం అక్కడే బైఠాయించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తన స్థలం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని బాధితురాలు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Next Story