విషాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన బెల్ట్ షాపు మద్యం..?

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామం లో తీవ్ర కలకలం రేగింది. గ్రామంలోని ఒక బెల్ట్ షాపులో మద్యం కొని సేవించిన పుల్లారెడ్డి (62), అంజిరెడ్డి (61) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు..

విషాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన బెల్ట్ షాపు మద్యం..?
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామం(Komerapudi)లో తీవ్ర కలకలం రేగింది. గ్రామంలోని ఒక బెల్ట్ షాపులో మద్యం కొని సేవించిన పుల్లారెడ్డి (62), అంజిరెడ్డి (61) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారు సేవించిన మద్యం కల్తీదేనని, అందుకే వారు ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం పోలీసులు ఈ మరణాలను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మద్యం నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపడంతో పాటు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరణానికి గల అసలు కారణాలను వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపుల నిర్వహణపై గ్రామస్తులు మండిపడుతుండగా, ఈ ఘటన స్థానికంగా విషాదఛాయలు నింపింది.

Next Story