అంబటి‌పై రాష్ట్రవ్యాప్తంగా 16 కేసులు.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక వివరాలు

by Ramesh Naini |

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అంబటి‌పై రాష్ట్రవ్యాప్తంగా 16 కేసులు.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక వివరాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదు అయి ఉన్నాయి. అంబటి పదేపదే విమర్శలు, వివాదాలు సృష్టిస్తున్నారని, సీఎం చంద్రబాబు నాయుడిని అసభ్య పదజాలంతో దూషించారని రిపోర్టులో పేర్కొన్నారు. 2 పార్టీల మధ్య వైషమ్యాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారని, అంబటి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తోందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా, జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో అంబటి రాంబాబు రిమాండ్‌పై వాదనలు ముగిశాయి. కాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేశారని అంబటి అన్నారు. నల్లపాడు పీఎస్‌లో తనను టార్చర్ చేశారని ఆరోపించారు.

Next Story