- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐటీడీపీ మాజీ నేత చేబ్రోలు కిరణ్‌పై 4 కేసులు.. గుంటూరు ఎస్పీ క్లారిటీ
ఐటీడీపీ మాజీ నేత చేబ్రోలు కిరణ్‌పై నాలుగు కేసులు నమోదు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీశ్ తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: ఐటీడీపీ మాజీ నేత చేబ్రోలు కిరణ్(Former ITDP leader Chebrolu Kiran)పై నాలుగు కేసులు నమోదు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీశ్(Guntur SP Satish) తెలిపారు. కిరణ్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ భార్య భారతి(YS Jagans wife Bharathi)పై కిరణ్ అసభ్యకరంగా మాట్లాడారని ఆయన తెలిపారు. మాజీ మంత్రి విడుదల రజిని(Former Minister Vidudala Rajini) ఇచ్చిన ఫిర్యాదుపైనా కిరణ్‌పై కేసు నమోదు చేశామని ఎస్పీ సతీశ్ తెలిపారు.
కాగా వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐటీడీపీ నుంచి సస్పెండ్ చేసింది. కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆయనను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు కిరణ్‌పై నమోదైన కేసులకు సంబంధించి ఎస్పీ సతీశ్ పూర్తి స్పష్టత ఇచ్చారు.






