రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. గుంటూరు సీఐడీ నోటీసులు

by Vemula.Srinu Prasad |

రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సీఐడీ నోటీసులు బిగ్ షాక్ ఇచ్చారు...

రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. గుంటూరు సీఐడీ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Director Ram Gopal Varma)కు మరో షాక్ తగిలింది. చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మార్ఫింగ్ ఫొటోల కేసుకు సంబంధించిన ఆయనను శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ ఒంగోలు రూరల్ పోలీస్టేషన్‌(Ongole Rural Police Station)లో విచారణ చేపట్టారు. మొత్తం 50 ప్రశ్నలను పోలీసులు సంధించారు. 44 ప్రశ్నలకు రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పారు. కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తు లేదని, తెలియదు అని ఆర్జీవీ తెలిపారు. దీంతో ఆయనకు కొంత సమయం ఇచ్చినా సమాధానం చెప్పలేకపోయారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. మరోసారి విచారణకు రావాలని సూచించారు. విచారణ ముగియడంతో ఆయన పోలీసుల స్టేషన్‌ను బయటకు వెళ్లారు.

అయితే గుంటూరు సీఐడీ పోలీసులు(Guntur CID Police) బిగ్ షాక్ ఇచ్చారు. అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా(Amma Rajyamlo Kadapa Redlu Movie)కి సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీ విచారణ ముగిసే వరకూ బయట సీఐడీ పోలీసులు ఎదురు చూశారు. విచారణ అనంతరం బయటకు రావడంతో రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేశారు. ఈ ఘటనతో రామ్ గోపాల్ వర్మ ఒక్కసారిగా ఖంగుతిన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో ఆర్జీవీ షేర్ చేశారు. దీంతో ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గానికి చెందని మద్దిపాడు పోలీస్ స్టేషన్ స్థానిక టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలని రామ్ గోపాల్ వర్మకు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. విచారణకు సమయం కోరుతూ వచ్చిన ఆర్జీవీ.. హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఒంగోలు రూరల్ పోలీసులు విచారణకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో శుక్రవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు.

Next Story