- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gunadala MeryMatha : నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
క్రైస్తవుల పవిత్ర స్థలమైన విజయవాడ గుణదల మేరీమాత(Gunadala MeryMatha) 101వ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : క్రైస్తవుల పవిత్ర స్థలమైన విజయవాడ గుణదల మేరీమాత(Gunadala MeryMatha) 101వ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల నేపథ్యంలో గుణదల మేరీమాత కొండను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలకరించారు. మూడురోజులపాటు జరిగే ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల క్రైస్తవ భక్తులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి లక్షలాది మండి తరలి వస్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు విజయవాడ పోలీసులు(Vijawada Police) తెలియజేశారు. అదేవిధంగా ఈ మూడు రోజులు మేరీమాత ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏలూరు రోడ్డు మార్గంలో సిటీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ ఉత్సవాల సందర్భంగా పూజలు, ఆరాధనలు, మరియు సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి. ఉత్సవాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు భక్తులకు హోటళ్లు, తాగు నీరు, వాష్ రూమ్స్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఉత్సవాలలో పాల్గొనబోతున్న భక్తులు కొండపై ఎక్కేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఉత్సవాలను సవ్యంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చర్చి నిర్వహకులు తెలిపారు.
గుణదల మేరీమాత చరిత్ర..
1923లో ఇటలీకి చెందిన ఫాదర్ అర్లాటి(Father Arlati) గుణదల కొండపై మేరీమాత ప్రతిష్టించారు. 1925 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ లోని లూర్థు మాత పండగ సందర్భంగా ఇక్కడ కూడా ఉత్సవాలు ప్రారంభించారు. ఆ తరువాత 1971లో ఫాదర్ తుమ్మా జోసెఫ్ ఆధ్వర్యంలో చర్చి నిర్మించగా.. క్రమంగా ఉత్సవాలు ప్రసిద్ధికెక్కాయి.






