- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడిన వివాదం.. తాకట్టు నుంచి రిలీజైన వెంకటేశ్వరస్వామి కిరీటం
గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయం కిరీటం వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఆలయ సమిటీ సభ్యులు తాకట్టు నుంచి కిరీటాన్ని విడిపించారు. ..

దిశ, వెబ్ డెస్క్: గుడివాడ వెంకటేశ్వరస్వామి ఆలయం(Gudivada Venkateswara Swamy Temple) కిరీటం(Crown) వివాదం(Dispute) ఎట్టకేలకు ముగిసింది. ఆలయ సమిటీ సభ్యులు తాకట్టు(Collateral) నుంచి కిరీటాన్ని విడిపించారు. సొంత అవసరాల కోసం రూ. 38 లక్షలకు బ్యాంకులో కిరీటాన్ని తాకట్టు పెట్టారు. దీంతో ఆలయ దాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామి ఆలయం కమిటీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణ చేయలేకపోతే తిరిగి ఇచ్చేయాలని వాపోయారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఆలయ కమిటీ సభ్యులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఆలయం ట్రస్ట్ సభ్యులు స్వామివారి కిరీటాన్ని విడిపించారు. అనంతరం కిరీటాన్ని ప్రజలకు చూపించారు. నిర్మాణ నిధుల కోసమే తాకట్టు పెట్టినట్లు తెలిపారు. తప్పు జరిగిందని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు తెలిపారు. కిరిటానికి సంప్రోక్షణ అనంతరం స్వామివారికి అలంకరిస్తామని ఆయన వెల్లడించారు.






