- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : టీడీపీ-వైసీపీ (TDP vs YCP) నేతల మధ్య మరోసారి వివాదం రాజుకుంది. టీడీపీ కీలక నేతల దావోస్ (Davos) పర్యటనను నేపథ్యం చేసుకొని వైసీపీ నేతలపై టీడీపీ విమర్శనాస్త్రాలను సంధించింది. అందులో భాగంగా మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) ను టార్గెట్ చేసింది. ఈ క్రమంలో అమర్నాథ్ దావోస్ సమ్మిట్ కు హాజరుకావడంలో విఫలమయ్యారని.. అసలు ఆ పార్టీ పాలనలో ఆహ్వానమే అందలేదని ఆరోపణలు చేసింది. అంతేకాకుండా చలికి భయపడి అమర్నాథ్ దావోస్ సదస్సుకు గతంలో వెళ్లలేదని కూడా ఎద్దేవా చేసింది. టీడీపీ నేతల కామెంట్స్ పై గుడివాడ అమర్నాథ్ కూడా ఘాటుగానే స్పందించారు.
ఈ క్రమంలో టీడీపీ నేతలకు వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. చలి కారణంగా తాను దావోస్ వెళ్లలేదని.. చలిని సైతం తట్టుకొని టీడీపీ మంత్రులు దావోస్ సమ్మిట్ కోసం జ్యూరిక్ వెళ్లారని ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. గతంలో తమకు దావోస్ నుంచి ఆహ్వానం అందిందని స్పష్టం చేశారు. అయితే చలి కారణంగా తాను వెళ్లలేదని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. నిజంగా తాను చలి పుడుతున్నందుకే వెళ్తున్నానని అంటున్న టీడీపీ నేతలు.. ఆ మాటలను ఎక్కడ అన్నానో నిరూపించాలని సవాల్ విసిరారు. తాను అలాంటి మాటలు మాట్లాడినట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని ప్రకటించారు.






