కాణిపాకం ఆలయంలో ఘోర అపచారం... అధికారులు, కాంట్రాక్టర్లపై భక్తుల ఆగ్రహం

by Kema Shiva Kumar |

కాణిపాకం (Kanipakam) శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోనే పేరుగాంచిన ఆలయం.

కాణిపాకం ఆలయంలో ఘోర అపచారం... అధికారులు, కాంట్రాక్టర్లపై భక్తుల ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: కాణిపాకం (Kanipakam) శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోనే పేరుగాంచిన ఆలయం. ఇక్కడ స్వయంభుగా కొలువైన గణపతిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. కానీ, ప్రస్తుతం అక్కడి అధికారులు, కాంట్రాక్టర్ల తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెడుతోంది.

తాజాగా, ఆలయ మూల విరాట్‌ వరసిద్ధి వినాయక స్వామి వారికి క్షీరాభిషేకం చేసేందుకు భక్తులు టోకెన్ తీసుకున్నారు. అనంతరం అభిషేకానికి పాలు సప్లయ్ చేసే కాంట్రాక్టర్ భక్తులకు పాలు ఇవ్వగా.. అవి విరిగిపోయి దుర్వసన వస్తున్నాయి. దీంతో వారు పాడైపోయిన పాలతో స్వామి వారికి అభిషేకం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఏం కాదు.. దేవుడికే కాదా అని ఉచిత సలహాలు ఇచ్చారని భక్తులు మండిపడ్డారు. ఎప్పటి నుంచి ఇలా జరగుతుందని అడగ్గా వారు పొంతన లేని సమాధానం చెప్పారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదని భక్తులు ఆరోపించారు. ఇప్పటికైనా ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి కాణిపాకం ఆలయన పవిత్రతను కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story