పేపర్ వాల్యుయేషన్‌లో ఘోర తప్పిదం.. లెక్చరర్‌కు రూ.7,500 ఫైన్, మూడేళ్లు డిబార్

by Kema Shiva Kumar |

గుంటూరు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని కావ్యకు బోటనీలో 60/60 మార్కులు వస్తే, లెక్చరర్ నిర్లక్ష్యంగా 6 మార్కులు వేసి ఫెయిల్ చేసిన ఘటన విదితమే.

పేపర్ వాల్యుయేషన్‌లో ఘోర తప్పిదం.. లెక్చరర్‌కు రూ.7,500 ఫైన్, మూడేళ్లు డిబార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల పేపర్ వాల్యుయేషన్‌లో (Paper Valuation) నిర్లక్ష్యం వహించిన ఓ లెక్చరర్‌కు ఇంటర్ బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. పరీక్షల్లో విద్యార్థినికి టాప్ మార్కులు వస్తే.. కేవలం సింగిల్ డిజిట్ మార్కులు వేసి ఫెయిల్ చేసినందుకు గానూ సదరు అధ్యాపకుడిపై ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకున్నది. గుంటూరు జిల్లాకు చెందిన కావ్య అనే విద్యార్థిని ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో బోటనీ (Botany) సబ్జెక్టులో ఫెయిల్ అయ్యింది. బాగా చదివే తనకు తక్కువ మార్కులు రావడం, అది కూడా ఫెయిల్ కావడంపై అనుమానం వచ్చిన కావ్య రీ-వెరిఫికేషన్, జవాబు పత్రం స్కాన్డ్ కాపీ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, జవాబు పత్రాన్ని పరిశీలించిన అధికారులకు లెక్చరర్ చేసిన ఘోర తప్పిదం బయటపడింది. విద్యార్థిని కావ్యకు బోటనీ పరీక్షలో 60 మార్కులకు గానూ 60 (60/60) మార్కులు వచ్చాయి. కానీ, పేపర్ దిద్దిన లెక్చరర్ నిర్లక్ష్యంగా ఓ సున్నాను (0) వదిలేసి, కేవలం 6 మార్కులు మాత్రమే వేసి ఆమె ఫెయిల్ అయ్యేందుకు కారణం అయ్యాడు.

జరిమానా, మూడేళ్ల పాటు డిబార్..

అయితే, విద్యార్థిని భవిష్యత్తుతో ఆడుకున్న లెక్చరర్ నిర్లక్ష్యంపై ఇంటర్మీడియట్ బోర్డు తీవ్రంగా పరిగణించింది. సదరు లెక్చరర్‌కు రూ.7,500 జరిమానా విధించడమే కాకుండా, రాబోయే 3 పాటు ఎలాంటి పరీక్షల పేపర్ వాల్యుయేషన్‌లో పాల్గొనకుండా డిబార్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Next Story