Green Channel : గుంటూరు నుంచి తిరుపతి గ్రీన్ ఛానెల్.. కారణం ఇదే

by Muthe.Rajitha |

ఏపీ(AP)లో మరికొద్ది సేపట్లో దాదాపు 400 కిమీల గ్రీన్ ఛానెల్(Green Channel) ఏర్పడబోతోంది.

Green Channel : గుంటూరు నుంచి తిరుపతి గ్రీన్ ఛానెల్.. కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో మరికొద్ది సేపట్లో దాదాపు 400 కిమీల గ్రీన్ ఛానెల్(Green Channel) ఏర్పడబోతోంది. గుంటూరు నుంచి తిరుపతి(Gunturu - Tirupati)కి గ్రీన్ ఛానెల్ ద్వారా గుండెను తరలించనున్నారు వైద్యులు. తిరుపతిలో చికిత్స పొందుతున్న ఒ వ్యక్తికి గుంటూరు రమేష్ ఆసుపత్రిలో బ్రైన్ డెడ్ కు గురైన ఒ మహిళ గుండెను అమర్చనున్నారు. ఓ ప్రమాదంలో బ్రైన్ డెడ్ కు గురైన మహిళ అవయవదానానికి ఆమె కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో.. తిరుపతిలోని ఒ ఆసుపత్రిలో మరో వ్యక్తికి గుండె మార్పిడి(Heart Transplant) చేయనున్నారు. అయితే గుంటూరు నుంచి తిరుపతికి 400 కిమీల సుధీర్ఘ ప్రయాణం కావడంతో రమేష్ ఆసుపత్రి నిర్వాహకులు సహాయం చేయమని మంత్రి లోకేష్(Minister Lokesh) ను కోరారు. ఈ వినతిపై తక్షణమే స్పందించిన లోకేష్.. గుండెను తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. కాగా మరికాసేపట్లో గుంటూరు, తిరుపతి గ్రీన్ ఛానెల్ మార్గాలుగా మారనున్నాయి.

Next Story