- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతిలో గ్రావెల్ మాఫియా? రైతుల ప్లాట్లలో అక్రమ తవ్వకాల ఆరోపణలు
రాజధాని అమరావతిలో అభివృద్ది ముసుగులో గ్రావెల్ మట్టి మాఫీయా చెలరేగిపోతుంది.

దిశ, ఏపీ బ్యూరో : రాజధాని అమరావతిలో అభివృద్ది ముసుగులో గ్రావెల్ మట్టి మాఫీయా చెలరేగిపోతుంది. రాజధాని అభివృద్ది వేగవంతంగా జరగాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, కొందరు కాంట్రాక్టర్లు, సూపర్ వైజర్లు మట్టి దోపిడీకి తెరలేపారు. కోట్లాది రూపాయల గ్రావెల్‌ను తరలిస్తూ జేబుటు నింపుకుంటున్నారు.
గుట్టుగా గ్రావెల్ తరలింపు..
మంగళగిరి మండలం నవులూరు గ్రామ పరిధిలోని వెస్ట్ బైపాస్‌కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 820 లోని సీఆర్డీఏ జోన్-12 కాలనీలో ఈ అక్రమ తవ్వకాలు వెలుగుచూశాయి. రైతులకు కేటాయించిన దాదాపు 10 ప్లాట్లలో, సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో 15 అడుగుల మేర లోతుగా తవ్వేసి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఎన్.సి.సి సంస్థకు చెందిన కాంట్రాక్ట్ సూపర్ వైజర్లు, సిబ్బంది కుమ్మక్కై ఈ మట్టి మాఫియాకు ధీటుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తవ్వకాలను అడ్డుకుున్న రైతులు
ఆదివారం ఉదయం అటుగా వెళ్తున్న రైతులకు మట్టి గుంతలు కనపడటంతో పాటు తవ్వకాలు జరుపుతుండటంతో నిర్వాహకులను నిలదీశారు. ఇది మీ ఫ్లాట్ అయితే కాగితాలు తీసుకురావాలని దబాయించడం, అక్రమార్కుల బరితెగింపునకు పరాకాష్టగా నిలిచింది. దీంతో రైతులు తిరుగుబాటు చేసి ఎక్స్‌కవేటర్, ఇతర వాహనాల తాళాలను లాక్కున్నారు. రైతులకు కేటాయించిన ఫ్లాట్లలో ఆక్రమంగా 15 అడుగులు గుంతలు పెట్టి గ్రావెల్ తొలగించి, నల్లమట్టితో పూడ్చివేస్తున్నారని రైతులు ఆరోపించారు. తవ్వకాలు జరిపిన ఫ్లాట్ లలో భవనాలు నిర్మించుకోవాలంటే పునాదులు బలంగా ఉంటాయా అని ఎన్ సి సి కాంట్రాక్ట్ సూపర్ వైజర్ ను రైతులు గట్టిగా ప్రశ్నించారు. అమరావతి రాజధానికి భూములిచ్చి అండగా ఉన్న టీడీపీ నాయకులు కార్యకర్తల ఫ్లాట్లలో ఆక్రమంగా తవ్వకాలు జరపటం కొసమెరుపు. రైతులు జరిగిన ఘటనపై సమాచారాన్ని మంత్రి నారా లోకేశ్ కార్యాలయం, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు.






