లక్ష్మీ నాయుడు హత్య కేసులో ప్రభుత్వ కీలక నిర్ణయం

by Thanuru Gopichand |   (  Updated:2025-10-22 07:03:08  IST  )

కందుకూరులో జరిగిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్య కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

లక్ష్మీ నాయుడు హత్య కేసులో ప్రభుత్వ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: కందుకూరులో జరిగిన తిరుమలశెట్టి లక్ష్మీ నాయుడు హత్య కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఆదేశాల మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హత్య విషయమై మంత్రులు వంగలపూడి అనిత, నారాయణ, డీజీపీ హరీశ్ గుప్తాలతో సీఎం చర్చించారు. ఘటనపై స్పందిస్తూ ఇది అత్యంత అమానవీయమైన చర్యగా పేర్కొన్నారు. హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని స్పష్టం చేశారు. విచారణ కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటరును కూడా నియమించాలన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం (Government) తరపున సహాయం చేయాలన్నారు.

జీవనాధారం కోల్పోయిన లక్ష్మీ నాయుడు కుటుంబానికి పరిహారం అందించాలన్నారు. భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5లక్షల నగదు అందించాలని, వారి ఇద్దరు పిల్లలకు రెండెకరాల భూమి ఇచ్చి, రూ.5లక్షల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని సూచించారు. హత్య ఉదంతంలో గాయపడ్డ బాధితులు పవన్, భార్గవ్ లకు కూడా పరిహారం ఇవ్వాలన్నారు. పవన్ కు 4 ఎకరాల భూమి, రూ.5లక్షల నగదు, భార్గవ్ కు రూ.3లక్షల నగదుతో పాటు ఇద్దరికీ ఆసుపత్రి ఖర్చులు (Hospital expenditures) చెల్లించాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతల విషయమై మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

READ MORE ...

దుబాయ్ టూర్‌కు బయలుదేరిన సీఎం చంద్రబాబు.. ప్రధాన లక్ష్యం అదే!

Next Story