AP News : పొగాకు రైతులకు సర్కార్ భారీ గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

పొగాకు రైతుల(Tobacco Farmers)కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

AP News : పొగాకు రైతులకు సర్కార్ భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : పొగాకు రైతుల(Tobacco Farmers)కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నల్ల బర్లీ పొగాకు రైతుల ఖాతాల్లోకి రూ.273 కోట్లు జమ చేసినట్టు సర్కార్(AP Govt) ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) వివరాలు వెల్లడిస్తూ.. పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. చివరి పొగాకు ఆకు వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఆయా రైతులకు ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు రాజులా బతికేలా చూస్తామని అన్నారు. డిమాండ్ కు తగ్గట్టు వాణిజ్య పంటలు వేసేలా రైతులను చైతన్య పరచాలని అధికారులను ఆదేశించారు. ఈ సదర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story