- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. బార్లలో 10శాతం షాపులు కేటాయింపు
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. బార్లలో 10శాతం దుకాణాలను కల్లుగీత కార్మికులకు కేటాయించాలని నిర్ణయించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. బార్లలో 10శాతం దుకాణాలను కల్లుగీత కార్మికులకు కేటాయించాలని నిర్ణయించింది. కేటాయింపుల్లో భాగంగా మొత్తం 840 బార్లు ఉంటే.. కల్లుగీత కార్మికులకు 84 కేటాయించారు. అంతేకాదు.. ఇప్పటికే మద్యం దుకాణాల్లో 10శాతం కేటాయించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కొత్త బార్ పాలసీపై ఎక్సైజ్‌శాఖ కసరత్తు తుది దశకు చేరింది. మద్యం షాపుల తరహాలోనే బార్లకు కూడా లాటరీ విధానంలోనే లైసెన్స్‌లు ఇవ్వాలని దాదాపు నిర్ణయానికి వచ్చింది. జగన్ హయాంలో వేలం విధానంలో బార్లకు లైసెన్స్‌లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత బార్లకు యథావిధిగా లైసెన్స్‌లు పొడిగించి.. కొత్త వాటికి మాత్రం లాటరీ నిర్వహించాలని వ్యాపారులు కోరినా.. మొత్తం బార్లకు కొత్తగానే లైసెన్స్‌లు జారీచేయాలని ఎక్సైజ్‌శాఖ నిర్ణయించింది.
Next Story






