Ap: వారి ఉద్యోగాలు మరో ఏడాది పొడిగింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-25 13:29:03  IST  )

తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసిన 175 పోస్టులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..

Ap: వారి ఉద్యోగాలు మరో ఏడాది పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: రెవెన్యూ శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసిన 175 పోస్టులను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక విధానంలో గతంలో 175 మంది డిప్యూటీ తహసీల్దార్లను భర్తీ చేసింది. అయితే వీరి పదవీ కాలం పలుమార్లు ముగిసింది. కానీ పొడిగిస్తూ వచ్చింది. తాజాగా కూడా వీరి పోస్టుల కాల పరిమితి అయిపోయింది. దీంతో మరో ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు చేసింది. దీంతో డిప్యూటీ తహసీల్దార్లను మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 31/03/2026 వరకూ సేవలు అందించనున్నారని పేర్కొంది.

Next Story