- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుబాటులోకి కొత్త టెక్నాలజీ... ఇకపై వెతుక్కునే పని లేదు...!
వరద బాధితుల కోసం కొత్త టెక్నాలజీని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది....

దిశ, వెబ్ డెస్క్: వర్షాకాలం(Rainy Season) వస్తే రాష్ట్రంలో వరదలు వచ్చే విషయం తెలిసిందే. ఒక్కసారిగా కురిసిన వర్షాలతో ప్రతీ ఏడాది చాలా ప్రాంతాల్లో ఊళ్లు(Villages), ఇళ్లు(Houses) నీట మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరద సహాయం(Flood Relief) కూడా కష్టంగా మారింది. అల్పాహారం, మంచి నీళ్లు, భోజనం, ఆర్థిక సాయం వంటివి అందించాలంటే ప్రతి సారి రెవెన్యూ అధికారులు నీళ్లలో ఉన్న ఇళ్లను వెతుక్కుంటూ రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పటి వరకూ ఆకలితో అలమటిస్తూ ఆహారం కోసం వరద బాధితులు ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ సాయం అందక అల్లాడిపోతున్నారు. ఇలాంటి అనుభవాలను ఏపీ ప్రభుత్వం(Ap Government), ప్రజలు చాలా సార్లు చవి చూశారు.
దీంతో వరద పరిస్థితులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కొత్త టెక్నాలజీ(New technology)ని వినియోగంలోకి తీసుకొస్తోంది. ప్రతి ఇంటికి జియోట్యాగ్(Geotag) చేస్తున్నారు. వరద వస్తే డ్రోన్ ద్వారా ఫోన్ చేసి ఇంటిపైకే ఆహారం, మంచి నీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం కొద్ది రోజుల్లో ప్రారంభంకావడంతో వరదలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆధునాతన టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వరద ప్రాంతాల్లో డ్రోన్స్ ద్వారా సేవలు అందించాలని అధికారులను ఆదేశించింది. ప్రతి ఇంటిని జియోట్యాగ్ పరిధిలో తీసుకురావాలని సూచించారు. తద్వారా వరద సాయం చాలా ఈజీ అవుతుందని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి వరదల్లో చిక్కుకున్న ఇళ్లను అధికారులు వెతుక్కోవాల్సిన అవసరం లేదన్నారు. డ్రోన్ ద్వారా ఫోన్ చేసి మరీ బాధితులకు వరద సాయం అందించొచ్చని తెలిపారు. వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ఆయా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డ్రోన్ సేవలను వినిగించి ప్రజలకు మరింత సేవ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.






