- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్ర కదలికలపై ప్రభుత్వం సీరియస్.. కీలక ఆదేశాలు
రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న ఉగ్ర కదలికలపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ పీపీఎన్ మాధవ్ తెలిపారు...

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న ఉగ్ర కదలికలపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ పీపీఎన్ మాధవ్ తెలిపారు. ఇటీవల విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన దర్యాప్తులో ఇతర ప్రాంతాలతో కలిపి 12 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాయచోటి సంఘటన అనంతరం ఉగ్ర కదలికలు వివిధ రూపాల్లో బయటపడుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కూడా విజయవాడ కేంద్రంగా రోహింగ్యాలు పట్టుబడిన ఘటనలను గుర్తుచేశారు.
తాజాగా సోషల్ మీడియా ద్వారా ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న ముఠాను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ప్రజలు మరింత బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దేశ భద్రత దృష్ట్యా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు తెలియజేయాలని సూచించారు. అలాగే, దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్న తర్వాత కొందరు తప్పుడు కథనాలు చెప్పే అవకాశముందని, అలాంటి వాటిని నమ్మకూడదని మాధవ్ హెచ్చరించారు.






