- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాశీబుగ్గలో ఘటనపై సర్కార్ సీరియస్.. విచారణకు ఆదేశం
by Gantepaka Srikanth |
శ్రీకాకుళం(Srikakulam) జిల్లా కాశీబుగ్గ(Kashibugga)లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం(Srikakulam) జిల్లా కాశీబుగ్గ(Kashibugga)లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట(Stampede Incident) జరిగి దాదాపు 9 మంది భక్తులు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్ ఊడిపడింది. భయంతో భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. తాజాగా ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఘటనపై శ్రీకాకుళం కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ముగ్గురు అధికారులతో కలెక్టర్ స్వప్నిల్ కమిటీ వేశారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టెక్కలి ఆర్డీవో, ఏఎస్పీ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌తో కమిటీ ఏర్పాటు చేశారు.
Next Story






