- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kollu Raveendra: ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం.. గత ప్రభుత్వంలో రెండూ నాశనం
రాష్ట్రంలో ఎక్కడైనా బెల్ట్ షాప్ ( ఉంటే మద్యం సరఫరా చేసిన వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడైనా బెల్ట్ షాప్ (Belt shop)ఉంటే మద్యం సరఫరా చేసిన వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ (Exise department) మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో ఇవాళ జరిగిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019- 24 మధ్య ఎక్సైజ్ వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. మధ్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చి వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకున్నారని విమర్శించారు. మల్టీ నేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని మార్కెట్ నుంచి దూరం చేసి, జే బ్రాండ్లను తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. దీంతో ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం రెండూ తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 6 రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీని అధ్యయనం చేసి నూతన పాలసీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం హోం శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గత ఐదేళ్ల అక్రమాల గురించి ఆ పార్టీ నేతలే బట్టబయలు చేశారని తెలిపారు. క్యాష్ అండ్ క్యారీ విధానంతో దాదాపు లక్ష కోట్ల లావాదేవీలు జరగడంపై సీఐడీ విచారణ జరుగుతున్నట్లు చెప్పారు






