- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా డీఎస్సీ-2025.. టీచర్ల నియామకం పై ప్రభుత్వం కీలక ప్రకటన
ఏపీ మెగా డీఎస్సీ అబ్యర్థులకు బిగ్ అలర్ట్. మెగా DSC-2025లో భాగంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గత నెలలో పరీక్షలు నిర్వహించారు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మెగా డీఎస్సీ అబ్యర్థులకు బిగ్ అలర్ట్. మెగా DSC-2025లో భాగంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గత నెలలో పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన మెగా డీఎస్సీలో వివిధ పరీక్షలకు సంబంధించిన ప్రైమరీ ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ పై మరో కీలక ప్రకటన చేసింది. ప్రాథమిక 'కీ'పై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత సబ్జెక్టుల వారీగా తుది 'కీ'ని విడుదల చేస్తామని విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఈ తరుణంలో మెగా డీఎస్సీ-2025 (జిల్లా సెలక్షన్ కమిటీ పరీక్షలు) తుది కీని ఈ నెల(జూలై) 25వ తేదీన విడుదల చేయడానికి నిర్ణయించారు.
ఈ క్రమంలో వచ్చే నెల(ఆగస్టు) 25వ తేదీ నాటికి ఎంపిక ప్రక్రియ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే, అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. అంటే అందుబాటులో ఉన్న ప్రతి పోస్టుకు ఒక అభ్యర్థి. ఎంపికైన అభ్యర్థులను విద్యా అర్హతలు, నేటివిటీ, రిజర్వేషన్, ఇతర అర్హతలు, తదితర సర్టిఫికెట్స్‌తో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అవసరమైన పత్రాలు సమర్పించకపోతే.. మెరిట్ జాబితాలో తదుపరి అర్హత కలిగిన వ్యక్తికి అవకాశం ఇవ్వబడుతుంది. ఆగస్టు 25 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.






