- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం తీసుకొచ్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని అదనపు అందస్తులను నిర్మించిన వారి కోసం.. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం తీసుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని అదనపు అందస్తులను నిర్మించిన వారి కోసం.. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం తీసుకొచ్చింది. 2025 ఆగస్టు 31 లోపు అనుమతులు లేకుండా నిర్మించిన 59,041 భవనాలు, 9,985 అదనపు అంతస్తులు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 49,056 భవనాలు క్రమబద్ధీకరించు కొనే అవకాశం కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే నాలా చట్టం రద్దు చేయబడింది. దాని స్థానంలో భూముల వ్యవసాయేతర వినియోగానికి బాహ్య అభివృద్ధి రుసుము వసూలు చేసే కొత్త ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించింది.
దరఖాస్తుదారుల నుంచి నిర్దేశిత రుసుములు వసూలు చేసి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు అనుమతులు జారీ చేయనున్నారు. ఇకపై 18-24 మీటర్ల ఎత్తు భవనాలు నాన్ హై రైజ్ కేటగిరీ లోకి వస్తాయి. ఈ నిర్ణయంతో అగ్నిమాపక శాఖ ఎన్వోసీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ చట్ట సవరణలతో ఇబ్బందుల తొలగిపోతున్నాయి. మహారాష్ట్ర మాదిరిగా చట్ట సవరణలు చేయడం ద్వారా బిల్డర్లు, ప్రజలకు సౌకర్యం అందుబాటులోకి రానుంది.






