ప్రతిభావంతులైన ఏపీ విద్యార్థులకు ప్రభుత్వ ఆతిథ్యం

by Thanuru Gopichand |

మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నాయకత్వంలో ఏపీ విద్యా రంగం కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది.

ప్రతిభావంతులైన ఏపీ విద్యార్థులకు ప్రభుత్వ ఆతిథ్యం
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నాయకత్వంలో ఏపీ విద్యా రంగం కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఆయన నాయకత్వంలో ప్రభుత్వం ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం టూర్ విజిట్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాకెట్రీ, స్పేస్ సైన్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తోపాటు సాంస్కృతిక వారసత్వం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది.

52మంది విద్యార్థులకు కేంద్రమంత్రి ఆతిథ్యం

ఏపీకి చెందిన 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు (Talented Students) కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ఆతిథ్యం ఇచ్చారు. దిల్లీలోని తన నివాసంలో వారిని కేంద్రమంత్రి కలిశారు. విద్యార్థులకు ఆతిథ్యం ఇవ్వడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ముందు చూపుతో కూడిన కార్యక్రమాల ద్వారా ఏపీ విద్యా రంగం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా టూర్ విజిట్ అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి అవకాశాలు వారిని వికసిత్ ఆంధ్ర – వికసిత్ భారత్ (Viksit Bharat) నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

తొలి విమానయానం కావడం విశేషం

దిల్లీలోని కేంద్రమంత్రి నివాసంలో ఆయన్ను కలిసిన విద్యార్థులు ఏపీ నుంచి దిల్లీకి (Delhi) విమానంలో ప్రయాణించారు. వారికిదే తొలి విమానయానం కావడం విశేషం. ఈ విషయమై వారితో మాట్లాడినప్పుడు ఒక చిన్న ప్రయాణం కూడా ఎంతటి పెద్ద కలలకు రెక్కలివ్వగలదో అనే భావన తనకు కలిగిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విద్యార్థుల ఆలోచనల్లోని స్పష్టత, మాటల్లోని ధైర్యం, జీవితంలో ముందుకు సాగాలనే పట్టుదల తనను ఎంతో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి వెలికి వస్తున్న అసాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులను చూస్తే గర్వంగా ఉందని తెలిపారు.

Next Story