- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Gummidi : యాక్ట్ 1/70 మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదు : మంత్రి గుమ్మిడి
యాక్ట్ 1/70 మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వాని(AP Governament)కి లేదని..ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి(Minister Gummidi Sandhyarani) స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : యాక్ట్ 1/70 మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వాని(AP Governament)కి లేదని..ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి(Minister Gummidi Sandhyarani) స్పష్టం చేశారు. 1/70 చట్టం పరిరక్షణ డిమాండ్‌తో గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలు మన్యం జిల్లాల 48 గంటలు బంద్ పాటిస్తున్న నేపథ్యంలో మంత్రి సంధ్యారాణి చట్ట పరిరక్షణపై స్పష్టతనిచ్చారు. గిరిజనులు 1/70 చట్టం పరిరక్షణ విషయంలో ఆందోళన చెందవద్దన్నారు.
వైసీపీ నేతలు విషప్రచారం చేస్తూ అసత్యాలు చెప్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. 5ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ గిరిజనుల జీవితాలతో ఆడుకున్నాడన్నారు. అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చిన వైసీపీ నేతలు గిరిజనుల ఉపాధికి గండి కొట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చటంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు.
కాగా గిరిజన, ఆదివాసీల భూములు అన్యాక్రాంతం కాకుండా వారికే చెందేలా భూమి బదాలాయింపు చట్టం1959తీసుకొచ్చారు. దీనిని 1970లో యాక్ట్ 1/70 చట్టంగా మార్పు చేశారు. ఈ చట్టం మేరకు గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడం నిషిద్ధం. గిరిజనులు, గిరిజనులు సభ్యులుగా ఉండే కోఆపరేటీవ్ సొసైటీకి తప్ప వేరే వారికి స్థిరాస్తిని అమ్మడం, కొనడం, గిఫ్ట్ డీడీ చేయడం వంటి బదాలాయింపులు నిషిద్ధం.
అయితే కూటమి ప్రభుత్వం ఈ చట్టంలో మార్పులు చేస్తే గిరిజన భూములు ఇతరుల పాలవుతాయన్న ఆందోళన ఏజెన్సీ జిల్లాల్లో నెలకొంది. చట్ట సవరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ గిరిజన, ఆదివాసీ సంఘాలు నేడు, రేపు బంద్ కు పిలుపునిచ్చాయి. దీనిపై స్పందించిన కూటమి ప్రభుత్వం యాక్ట్ 1/70 చట్టంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని..అదంతా వైసీపీ దుష్ప్రచారమని స్పష్టం చేసింది.






