- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mega DSc : నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్
నిరుద్యోగులకు ఏపీ సర్కార్(AP Govt) మరో గుడ్ న్యూస్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు ఏపీ సర్కార్(AP Govt) మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇదివరకే 16 వేలకు పైగా పోస్టులతో ఏపీ మెగా డీఎస్సీ(Mega DSc) నోటిఫికేషన్ విడుదల చేయగా.. నేడు దానికి అనుబంధంగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటా(Sports Quota) కింద 421పోస్టులకు ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన క్రీడాకారులుకు 3 శాతం హరిజాంటల్ రిజర్వేషన్ తో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి రాంప్రసాద్(Minister Ram Prasad) ప్రకటించారు. అయితే ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండానే క్రీడల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 333 పోస్టులు ఉండగా.. మిగతావి ఇతర పాఠశాలల్లో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 20న మొత్తం 16, 347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తు ప్రక్రియ ఉండగా.. వీటికి సంబంధించిన పరీక్షలు జూన్ 5 నుంచి జులై 6 వరకు నిర్వహించనున్నారు.






