నాయీ బ్రాహ్మణులకు సర్కార్ గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

నాయీ బ్రాహ్మణులకు సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఉన్న కాంప్లెక్సుల్లో నాయీ బ్రాహ్మణులకు షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన మెమోలను కూడా బీసీ సంక్షేమ శాఖ గురువారం విడుదల చేసింది. 1996లోని జీవో 13 ను అనుసరించాలని.. కలెక్టర్లు, కార్పొరేషన్లు, మున్సిపల్ అధికారులకు ఉత్తర్వుల్లో సూచించింది. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story