AP News :ఖాదీ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

ఖాదీ ఉద్యోగుల(Khadi Employees)కు ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది.

AP News :ఖాదీ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఖాదీ ఉద్యోగుల(Khadi Employees)కు ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలోని ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు ఏపీ సర్కార్ ఓ భారీ శుభవార్తను అందించింది. బోర్డు ఉద్యోగులందరికీ ఇకపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా EHS కింద వైద్య సేవలు కొనసాగిస్తామని ప్రకటించింది. ఉద్యోగులకు ఇక ముందుక కూడా ఈహెచ్ఎస్ వైద్యసేవలు కంటిన్యూ చేయాలని ఖాదీ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ విజ్ఞప్తిని మన్నించిన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీస్, కామర్స్ స్పెషల్ జనరల్ సెక్రెటరీ ఆర్పీ సిసోడియా ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఖాదీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story