- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్నూమిన్నూ కానడంలేదు: అరవ శ్రీధర్‌పై జనసేన ఎమ్మెల్యేల అసహనం
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ప్రభుత్వ ఉద్యోగి వీణ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్(Railway Kodur MLA Arava Sridhar)పై ప్రభుత్వ ఉద్యోగి వీణ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తనను నమ్మించి మోసం చేశారని, తన పెగ్నెన్సీని కూడా పలుమార్లు తీయించారని మీడియా ముఖంగా చెప్పారు. అంతేకాదు తనకు న్యాయం చేయాలని ఇప్పటికీ ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీంతో వీణ ఆరోపణలపై జనసేన క్రమ శిక్షణ కమిటీకి అరవ శ్రీధర్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే అరవ శ్రీధర్ తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇంకా తప్పుబడుతునే ఉన్నారు. పార్టీ పరువు పోగొట్టారని మండిపడుతున్నారు.
పార్టీ పరువు తీస్తున్నారు..
అయితే ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు అరవ శ్రీధర్ రాకపోవడంపై జనసేన ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అరవ శ్రీధర్ తలదించుకునే పనులు చేసి పార్టీ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యకం చేశారు. అసెంబ్లీకి రావొద్దని పార్టీ పరంగా తాము ఎక్కడా చెప్పలేదని, పార్టీ వ్యవహారాలకు మాత్రమే దూరంగా ఉండాలని సూచించామన్నారు. అసెంబ్లీకి వచ్చేందుకు అరవ శ్రీధర్‌కు మొహం చెల్లడం లేదేమోనన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేశామని, కేసులు భరించామని, జైళ్లకు కూడా వెళ్లి వచ్చామని, ఇప్పుడు ఎమ్మెల్యేలమయ్యామని, కొందరు మాత్రం దారి తప్పి పవన్ కల్యాణ్ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఒక్కసారిగా అధికారం చూసేసరికే కొందరికి కన్నూమిన్నూ తెలియడంలేదని జనసేన ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.






