- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిలో కొలువు దీరుతున్న బ్యాంకులు, బీమా సంస్థలు ఇవే.. 6 వేలకు పైగా ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటోన్న అమరావతిలో.. ఉద్యోగాల కల్పనకు నేడు మరో కీలక అడుగు పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటోన్న అమరావతిలో.. ఉద్యోగాల కల్పనకు నేడు మరో కీలక అడుగు పడింది. 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పయ్యావుల కేశవ్, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వివిధ బ్యాంకులు, బీమా సంస్థల చైర్మన్లు పాల్గొన్నారు. కాగా.. వీటి ఏర్పాటుతో రాష్ట్రంలో వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. నేడు శంకుస్థాపనలు జరిగిన బ్యాంకులు, బీమా సంస్థల నిర్మాణ వ్యయం, ఉద్యోగాల వివరాలు ఇలా ఉన్నాయి.
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.300 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తుండగా 2000 ఉద్యోగాలు రానున్నాయి.
2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.50 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తుండగా 160 ఉద్యోగాలు కల్పించనున్నారు.
3. రూ.256 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు : 1000 ఉద్యోగాలు
4. రూ.40 కోట్ల పెట్టుబడితో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 300 ఉద్యోగాలు
5. రూ.200 కోట్ల పెట్టుబడితో ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ : 400 ఉద్యోగాలు
6. రూ.40 కోట్ల పెట్టుబడితో బ్యాంక్ ఆఫ్ ఇండియా : 200 ఉద్యోగాలు
7. రూ.50 కోట్ల పెట్టుబడితో కెనరా బ్యాంక్ : 300 ఉద్యోగాలు
8. రూ.60 కోట్ల పెట్టుబడితో బ్యాంక్ ఆఫ్ బరోడా : 300 ఉద్యోగాలు
9. రూ.40 కోట్ల పెట్టుబడితో ఇండియన్ బ్యాంక్ : 105 ఉద్యోగాలు
10. రూ.90 కోట్ల పెట్టుబడితో నాబార్డ్ : 160 ఉద్యోగాలు
11. రూ.15 కోట్ల పెట్టుబడితో పంజాబ్ నేషనల్ బ్యాంక్ : 150 ఉద్యోగాలు
12. రూ.4 కోట్ల పెట్టుబడితో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ : 65 ఉద్యోగాలు
13. రూ.50 కోట్ల పెట్టుబడితో ఐడీబీఐ బ్యాంక్ : 215 ఉద్యోగాలు
14. రూ.22 కోట్ల పెట్టుబడితో ఎల్ఐసీ : 1036 ఉద్యోగాలు
15. రూ.93 కోట్ల పెట్టుబడితో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ : 150 ఉద్యోగాలు






